కేంద్రమంత్రి పియూష్ గోయల్, తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం

-

తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలుపై ఈ రోజు కేంద్రమంత్రి పియూష్ గోయల్ తో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. ఈ సందర్భంలో తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బాయిల్డ్ రైస్ ను కొనదని మంత్రులకు తేల్చి చెప్పారు పియూష్ గోయల్. పంజాబ్ లో ధాన్యాన్ని కొనుగోలు చేసి… తెలంగాణ ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయరని ప్రశ్నించారు ప్రశాంత్ రెడ్డి. దీనికి సమాధానంగా పంజాబ్ లాగే మీరు కూడా ధాన్యాన్ని సరఫరా చేయడంటూ పీయూష్ గోయల్ అన్నారు. ఇప్పుడున్న విధానాన్ని ప్రజల కోసం మార్చాలని ప్రశాంత్ రెడ్డి కోరగా… మీరు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చండంటూ పియూష్ గోయల్ సమాధానం ఇచ్చారు. భగవంతుడు దయ తలిస్తే తప్పకుండా ఏర్పాటు చేస్తామని…మాకు సమయం వస్తుందంటూ ప్రశాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. బీజేపీ కూడా ఇద్దరు వ్యక్తులతో ప్రారంభం అయి ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు వచ్చిందని ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మిగతా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రశాంత్ రెడ్డి, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు చూపించారు. బయట దుకాణంలో ఏది అమ్ముడు పోతుందో అదే కొంటామని… తెలంగాణ నుంచి ధాన్యం సేకరణ చేయమని.. బియ్యాన్ని మాత్రమే తీసుకుంటామని పియూష్ గోయల్, తెలంగాణ మంత్రులకు తేల్చి చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news