BREAKING : బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో మంత్రి KTRపై పోలీస్ కేసు

-

BREAKING : బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో మంత్రి KTRపై పోలీస్ కేసు నమోదు అయింది. ఈ కేసును వైఎస్‌ షర్మిల పెట్టారు. TSPSC పేపర్ లీకేజీపై ప్రగతి భవన్ సూచనలతోనే సిట్ దర్యాప్తు జరుపుతోందని…బాధ్యత వహించాల్సిన IT శాఖ మంత్రి మాకేం సంబంధం అని తప్పించుకున్నారని ఈ ఫిర్యాదులో పేర్కోంది. కంప్యూటర్లకు భద్రత లేనప్పుడు ఇది పూర్తిగా IT శాఖ వైఫల్యమే.

ఐటీ శాఖపై విచారణ కోరుతూ ఈరోజు బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో మంత్రి KTRపై ఫిర్యాదు చేశామని వెల్లడించారు. కేటీఆర్ నాకేం సంబంధం ఏంటని అంటున్నారు. పేపర్ లీకేజీకి పూర్తి బాధ్యత కేటీఆర్ దేనని.. సిట్ దర్యాప్తు ప్రగతి భవన్ నుండే నడుస్తోందని ఫైర్‌ అయ్యారు. ఎవరిని విచారించాలి? ఎవరి పేర్లు చేర్చాలి అనేది ప్రగతి భవన్ డైరెక్షన్ నుండే నడుస్తోంది…ఐటీ శాఖ బాధ్యత వహించకపోతే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సిస్టంకి ఐటీ శాఖనే బాధ్యత వహించాలని.. TSPSC లో ఉన్న సిస్టమ్స్ కి ఆడిట్ సర్టిఫికెట్స్ ఉన్నాయా? అని ప్రశ్నించారు. TSPSC సిస్టమ్స్ మళ్ళీ హ్యాక్ జరగదని గ్యారెంటీ ఎంటి? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news