మంత్రి ఎర్రబెల్లి కారును తనిఖీ చేసిన పోలీసులు

-

మునుగోడు ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ ప్రచార జోరు పెంచింది. టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు మునుగోడులేనే తిష్ట వేసి గడపగడపకు తిరుగుతున్నారు. కేసీఆర్ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు.

మునుగోడు ఉపఎన్నికలో ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కారును పోలీసులు తనిఖీ చేశారు. పలివెల చెక్‌పోస్టు వద్ద మంత్రి కాన్వాయ్‌ని ఆపిన పోలీసులు.. ఆయన కారుతోపాటు మిగిలిన వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు వాడవాడ తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మునుగోడు అభివృద్ధి టీఆర్‌ఎస్‌తో సాధ్యమని అందువల్ల పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు. ఎమ్మెల్సీ ఎల్‌ రమణతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు చండూరు మున్సిపాలిటీలో ప్రచారం నిర్వహించారు. కారు, సారు, సర్కారును మరవొద్దని ప్రజలకు సూచించారు. ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిపించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news