యాలాల్ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసులు ఓవరాక్షన్..!

-

వికారాబాద్ జిల్లా.. యాలాల్ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసులు   ఓవర్ యాక్షన్ చేసినట్టు సమాచారం. బాగాయిపల్లిలో కుటుంబ సభ్యులతో వెళుతున్న నర్సింహులు పై ఇద్దరు కానిస్టేబుళ్ళ దాడి చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ కోసం నర్సింహులును ఇద్దరు పోలీసులు ఆపారు. తను శుభకార్యానికి వెళ్లి తిరిగి వెళ్తున్నామని త్వరగా పంపించాలని కోరాడు నర్సింహులు.

అయినప్పటికీ కొద్దిసేపు ఇక్కడే ఉండు పంపిస్తామని చెప్పడంతో అక్కడే ఉన్నాడు. కొద్ది సేపటి తరువాత సార్ తాము కుటుంబంతో ఉన్నా సార్.. త్వరగా పంపించాలంటూ కోరాడు నర్సింహులు. అక్కడే పోలీసులకు  నర్సింహులకు మధ్య మాటల యుద్ధం జరిగింది. నర్సింహులు తల పగిలి గాయాలయ్యాయి.  నర్సింహులు కూతురు కాలుకు కూడా గాయాలయ్యాయి. పోలీసులు తనను రాయితో తలపై కొట్టారంటూ డీఎస్పీ కార్యాలయం దగ్గర వచ్చి నర్సింహులు హల్ చల్ చేశాడు. తన తన పగులగొట్టిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version