నేడు రాహుల్ గాంధీని కలవనున్న పొంగులేటి, జూపల్లి

-

కాంగ్రెస్​లో ఇవాళ చేరికల కోలాహలం కనబడనుంది. భారీ సంఖ్యలో ఇతర పార్టీల నేతలు హస్తం గూటికి చేరుకోనున్నారు. ముఖ్యంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల చేరికపై ఇవాళ క్లారిటీ రానుంది. వీరిద్దరు కాంగ్రెస్‌లో చేరేందుకు చొరవచూపినా అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. ఇటీవలే జూపల్లి, పొంగులేటిని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఐతే రాహుల్‌గాంధీ అమెరికా పర్యటనలో ఉండడంతో ఆయన్ను కలిసేందుకు వీలుకాలేదు.

ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రాహుల్‌తోపాటు ఇతర అగ్ర నేతలతో సమావేశానికి ముహూర్తం ఖరారైంది. రాహుల్‌ గాంధీ, ఇతర కాంగ్రెస్‌ పెద్దలను కలిసేందుకు పొంగులేటి ఇప్పటికే దిల్లీ వెళ్లారు. పొంగులేటితోపాటు సుమారు 47 మంది అనుచరులు.. జూపల్లితోపాటు మరో 10 నుంచి 12 మంది మధ్యాహ్నం రాహుల్‌తో భేటీ కానున్నారు. ఆ తర్వాత మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్‌లతో సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం పొంగులేటి, జూపల్లిలో కాంగ్రెస్​లో చేరతారా లేదా అనే దానిపై స్పష్టత రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news