రాహుల్ గాంధీ సవాల్ ని స్వీకరించిన ప్రధాని మోడీ.. జగిత్యాల సభలో సంచలన వ్యాఖ్యలు

-

రాహుల్ గాంధీ శక్తిని నాశనం చేయాలన్న సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. తాజాగా జగిత్యాలలో జరిగిన విజయ సంకల్ప సభలో ప్రసంగించారు ప్రధాని మోడీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని.. ఇక్కడి డబ్బు ఢిల్లీలోని కుటుంబ పార్టీ నేతలకు చేరుతోంది. దేశంలో జరుగుతున్న అన్ని మోసాలకు కుటుంబ పార్టీలే ఇక్కడ దోచుకున్న సొమ్మును కుట్రలకు వినియోగిస్తున్నారు. తెలంగాణా కారణమన్నారు. శివాజీ మైదానంలో తన పోరాట పటిమకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఎన్నో మాటలు అన్నారు. శక్తిని నాశనం చేసేవారికి మరియు శక్తిని పూజించే వారికి మధ్య పోరాటం జరగబోతోంది. నాకు ప్రతి స్త్రీ శక్తి రూపంగా కనిపిస్తుంది అన్నారు.

చంద్రయాన్ విజయవంతం అయిన ప్రదేశానికి శివశక్తి అని పేరు కూడా పెట్టాను. శక్తి ఆశీస్సులు ఎవరికి ఉన్నాయో జూన్ 04వ తేదీన తేలిపోనుంది. నేను భారతమాతకు పూజారిని’ అని వ్యాఖ్యానించారు. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. తెలంగాణ ప్రజలు వికాసిత్ భారత్కు ఓటు వేయబోతున్నారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. మల్కాజిగిరిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ ప్రజలు అబ్ కీ బార్ అంటున్నారు.. 400 పార్. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ నిన్న విడుదలైంది. గడిచిన మూడు రోజుల్లో తెలంగాణకు రెండు సార్లు వచ్చాను. దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. భారతదేశం అభివృద్ధి చెందితే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news