అగ్నిప‌థ్ : నేరం చేసిందెవ‌రు ?  ఘోరం ఆపిందెవ‌రు ?

-

నిన్న‌టి వేళ ఎన్నో అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. కొంద‌రు యువ‌కుల ఆగ్ర‌హావేశాలు కార‌ణంగా వారు కోల్పోయిన విచ‌క్ష‌ణ కార‌ణంగా ఎన్నో సంఘ‌ట‌న‌లు విషాద స్మృతిలో చేరాయి. అగ్నిప‌థ్ అనే ప‌థ‌కానికి వ్య‌తిరేకంగా చేస్తున్న లేదా చేయాలనుకుంటున్న ఆందోళ‌న‌లు ఇక‌పై ఆగితే  చాలు. ఇంకేమీ వద్దు. ముఖ్యంగా నిర‌స‌న‌లు తెలిపేందుకు ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ల‌క్ష్యంగా చేసుకోవ‌డంలో అర్థం ఏమీ లేదు.

అడిగే ప‌ద్ధ‌తి ఇది కాదు
యుద్ధం చేసే ప‌ద్ధ‌తి ఇది కాదు
దేశాన్ని ప్రేమించే ప‌ద్ధ‌తి కూడా ఇది కాదు
అస్స‌లు పశ్చాత్తాపం అన్న‌ది లేకుండా మాట్లాడుతున్నారే!
రేప‌టి వేళ కేసులు న‌మోదు అయి జైలు పాల‌యితే
ఏ నాయ‌కుడు వ‌చ్చి మిమ్మ‌ల్ని  కాప‌డ‌గ‌ల‌డు?
గుర్తు పెట్టుకోండి ప్రజ‌ల ఆస్తుల‌ను ధ్వంసం చేసి అనుకున్న‌విధంగా
ప్ర‌భుత్వాల‌ను దారికి తెచ్చుకోవడం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని!

మీ క‌ల‌ల‌ను నిజం చేసుకునే క్ర‌మం ఇద‌యితే కాదు. మ‌రో దారి ఏద‌యినా ఉంటే అది శాంతి మార్గం అయి ఉండాలి. ఒప్పుకోవాలి ఇందులో పాల‌కుల త‌ప్పిదాలున్నాయి. కానీ కోట్లు విలువ‌చేసే ప్ర‌జ‌ల ఆస్తుల‌ను ధ్వంసం చేసే హ‌క్కు ఎవ్వ‌రికీ లేదు. అది త‌ప్పు. అడితే ప‌ద్ధ‌తి నిర‌స‌న చెప్పే ప‌ద్ధ‌తి అన్న‌వి శాంతియుతంగా సాగితేనే మేలు. యువ‌తా మేలుకో మంచి మార్గంలోనే న‌డిచి మంచి ఫ‌లితాలు అందుకో !

దేశానికి సేవ చేయాల‌నుకుంటున్న ప‌ద్ధ‌తి ఇది అయితే కాదు. ఇందులో పాల‌కుల త‌ప్పిదాలు వాళ్ల త‌క్ష‌ణ అవ‌స‌రాలు అన్న‌వి ఎప్పుడూ చ‌ర్చ‌కు ఉండేవే ! వాటిని దృష్టిలో ఉంచుకుని రైళ్ల‌ను త‌గుల‌బెట్ట‌డం,  ప్ర‌యాణికులను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేయ‌డం అన్న‌వి త‌గ‌ని ప‌ని. ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేష‌న్  బాలేదు.. లేదా ఇప్ప‌టిదాకా చేయాల‌నుకున్న ప‌నులు బాలేవు. వీటిపై కేంద్రాన్ని నిల‌దీసే ప్ర‌య‌త్నం ఒకటి త‌ప్ప‌క చేయాలి.

కానీ రైల్వే ఆస్తుల‌ను ధ్వంసం చేసి ఏం సాధించాల‌నుకుంటున్నారు అన్న ప్ర‌శ్న ఇవాళ పౌర స‌మాజం నుంచి వ‌స్తోంది. కాస్త ఆగండి ప్ర‌యివేటు సైన్యం లేదా పార్ట్ టైం సైన్యం అంటూ ఏవేవో చెబుతున్నారు క‌దా ! వాటిని వ‌ద్ద‌నుకునే ప‌ని అయితే ఇది కాదు. శాంతి యుతంగా అడిగే ప‌ద్ధ‌తి మాత్రం మేలు చేస్తుంది. హింస ద్వారా సాధించేదేమీ ఉండదు. ఈ విధంగా అడిగినంత మాత్రాన పాల‌కులు దిగివ‌చ్చేస్తారు అని అనుకోవ‌డం కూడా త‌గ‌దు. మంచి దేశాన్ని మంచి స‌మాజాన్ని నిర్మించే ప‌ద్ధ‌తి ఇది కాదు.

Read more RELATED
Recommended to you

Latest news