ఖమ్మం జిల్లా వైరాలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న తెలంగాణ జనగర్జన సభకు హాజరయ్యేందుకు బయలుదేరిన ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరి కాసేపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ నేతలు సమావేశమవుతారు. ఏపీలోని రాజకీయ పరిస్థితులపై రాహుల్ గాంధీతో కాంగ్రెస్ నేతలు చర్చించే అవకాశం ఉంది.
అనంతరం అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా ఖమ్మం కాంగ్రెస్ సభకు చేరుకుంటారు. అనంతరం సభలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. కాంగ్రెస్ లో కీలక నేతల చేరిక, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కి సన్మానం అనంతరం.. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. సభ ముగిసిన తర్వాత రాహుల్ తిరిగి హస్తినకు ప్రయాణం అవుతారు.