రెండో రోజు 16.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ

తెలంగాణలో వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతుబంధు నిధుల పంపిణీ మంగళవారం నుంచి మొదలైంది. మొత్తం 68,94, 486 మంది రైతులకు పెట్టుబడి సాయం అందనుంది. ఎకరాకు రూ. 5 వేల చొప్పున విడతలవారీగా రూ.7,654,43 కోట్లను రైతులకు ప్రభుత్వం చెల్లించనుంది. రాష్ట్రంలోని 1.53 కోట్ల ఎకరాలకు రైతుబంధు అందనుంది. ఇందులో భాగంగా మంగళవారం తొలిరోజు ఎకరాలోపు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో 19.98 లక్షల మంది రైతులకు చెందిన 11.73 లక్షల ఎకరాలకు రూ.586.65 కోట్లను జమ చేసింది ప్రభుత్వం.

రెండు రోజుల్లో మొత్తంగా 36.30 లక్షల మంది రైతులకు చెందిన 36.41 లక్షల ఎగరాలకు రూ.1820.75 కోట్లను జమ చేసింది. కాగా గత ఎనిమిది విడతలలో రూ 50.448 కోట్ల సాయం అందించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో దాదాపు కోటి యాభై లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం అందుతోందని ప్రభుత్వం తెలిపింది.