విశాఖ ఘటన తర్వాత మంగళగిరి సమావేశంలో జగన్ సర్కారుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. చెప్పు చూపించి మరీ వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. తన వ్యక్తిగత జీవితం జోలికి రావొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
జనసేనాని స్పీచ్‌పై తాజాగా.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. గత వందేళ్లలో తాను విన్న అత్యంత ప్రభావవంతమైన, అద్భుతమైన స్పీచ్ పవన్ కల్యాణ్‌ది అన్న ఆర్జీవీ.. జనసేనాని చెప్పే ధర్మం మనవాళ్లలో కొందరికి అర్థం కాదన్నారు. ఓ తీవ్రతతో గుండెల్లోకి చొచ్చుకుపోయేలా పవన్ కల్యాణ్ మాటలు ఉన్నాయని కొనియాడారు. మంచి వాక్పటిమతో ఉన్న జనసేనాని స్పీచ్ ఎప్పుడూ జనాలను కదిలిస్తుందని ఆర్జీవీ ట్వీట్ చేశారు.
ఎప్పుడూ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించే ఆర్జీవీ ఈసారి అందరు ఆశ్చర్యపోయేలా పవన్ ని ప్రశంసించం చర్చనీయాంశమైంది. మరోవైపు విమర్శించడంలో ఇది కొత్త స్టైలేమో అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
VITRIOLIC RHETORIC is what which always moved the masses and @PawanKalyan ‘s speech is the PENULTIMATE DEMONSTRATION of CHANNELISED INTENSITY designed to PENETRATE the HEARTS https://t.co/fB9UDFRLyS
— Ram Gopal Varma (@RGVzoomin) October 20, 2022