జాతీయ జెండాను అవమానించిన రేగా కాంతారావు..టీఆర్ఎస్ జెండాలతో !

భద్రాద్రి జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌. ఎప్పుడు ఎదో ఒక అంశంపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు రేగా కాంతారావు. అయితే.. తాజాగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మరో వివాదంలో చిక్కుకున్నారు. రేగా కాంతారావు అనుచరులు అత్యుత్సహంతో జాతీయ జెండాను అవమానించే విధంగా పోస్టులను పెట్టారు.

జాతీయ జెండా మద్య లో తెల్ల కలర్ ఉండే చోట గులాబి రంగును పెట్టడంతో పాటుగా ఎమ్మెల్యే రేగాకాంతారావు పోటోను కూడా పెట్టారు. ఇది వివాదంగా మారింది. జాతీయ జెండాలో కలర్ ను మార్చడమే కాకుండా ఎంఎల్ఎ పోటో ను కూడ జాతీయ జెండా రూప శిల్పి పింగలి వెంకయ్య పోటో పక్కన నే రేగా కాంతారావు పోటోను పెట్టారు. దీనిని రేగా యూత్ సీతం పేట గ్రామానికి చెందిన సోషల్ మీడియా గ్రూపు దీనిని పెట్టారు. దీనితో నెటిజెన్ లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరి దీనిపై కాంతారావు ఎలా స్పందిస్తారో చూడాలి.