తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా, కాంగ్రెస్‌ పార్టీదే – రేవంత్‌ రెడ్డి

-

తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా, కాంగ్రెస్‌ పార్టీదేనని వెల్లడించారు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి. ఇవాళ్టికి తెలంగాణ రాష్ట్ర ఏర్పడి.. 10 ఏళ్లు పూర్తయింది. ఈ తరుణంలోనే.. టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.

తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి…. తెలంగాణ యువత, విద్యార్థుల త్యాగాల ఫలితం.. అమ్మ సోనియమ్మ కారుణతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యం అయ్యిందని వెల్లడించారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల ఆకాంక్షలను నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది.. సోనియమ్మ దని పేర్కొన్నారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరపాలి..ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి..

 

Read more RELATED
Recommended to you

Latest news