కాంగ్రెస్ లో చేరికపై నా ఆలోచన ఇదే.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

కబ్జాలు చేసే అవసరం తనకు లేదని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తనకు తెలంగాణలో ఎవ్వరికీ లేనంత ల్యాండ్ బ్యాంక్ ఉందన్నారు. ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే అయ్యానన్నారు. ఇంత మంచి పేరు ఉన్న తనకు అవినీతి చేయాల్సిన అవసరం లేదన్నారు. బఫర్ జోన్ల కట్టినందుకే తన అల్లుడి కాలేజీలో కూల్చివేతలు చేశారన్నారు మల్లారెడ్డి. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు మల్లారెడ్డి.

ఇటీవల వివాదం జరిగిన ల్యాండ్ 14 ఏళ్ల క్రితం కొనుగోలు చేశామన్నారు. లక్ష్మణ్ కుమార్ తప్పుడు పత్రాలతో తన భూమిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదన్నారు. రాజకీయాల్లోకి రాకముందే తనకు విద్యాసంస్థలు ఉన్నాయన్నారు. వేయేండ్ల వరకు తరగని ఆస్తి ఉందన్నారు. తనపై ఆసలు ఆరోపణలు లేవనన్నారు. మంచితనంతోనే ఫేమస్ అవుతున్నానన్నారు. తన సమస్యల పరిష్కారం కోసమే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిశానన్నారు. రేవంత్ రెడ్డిని కూడా కలుస్తానన్నారు. అధికారంపై తనకు మోజు లేదన్నారు. కేటీఆర్ చేసిన అభివృద్ధి కారణంగానే హైదరాబాద్ లో బీఆర్ఎస్ మెజార్టీ అసెంబ్లీ సీట్లను సాధించిందన్నారు. బీఆర్ఎస్ కు 5-8 ఎంపీ సీట్లు వస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. కాలేజీలు నడుపుకుంటూ.. ప్రజా సేవ చేస్తానని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news