స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై ఆర్టీఏ అధికారుల తనిఖీలు

-

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీఏ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ఫిట్ నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో వరుసగా తనిఖీలు చేస్తున్నారు. అయితే, గత మూడు రోజులుగా రంగారెడ్డి జిల్లాలో పాఠశాల బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు కొనసాగుతున్నారు. రాజేంద్రనగర్, మియాపూర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, ఉప్పల్ లో అధికారుల బృందం తనిఖీలు చేస్తున్నారు. విద్యార్థులను రవాణా చేసే స్కూల్ బస్సులపై రవాణా శాఖ సీరియస్ గా వ్యవహరిస్తుంది. పాఠశాల యజమానులకు ఆర్టీఏ చమటలు పట్టిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏ పాఠశాల బస్సు తిరిగినా తక్షణమే సీజ్ చేస్తున్నారు. ఇక, రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 150 బస్సులపై ఆర్టీఏ అధికారులు
కేసులు నమోదు చేశారు.

నూతన విద్యా సంవత్సరం ఈనెల 12నుంచి ప్రారంభం అయింది. స్కూల్స్, కాలేజీలు ఓపెన్ అయ్యాయి. స్టూడెంట్స్ ను తరలించేందుకు స్కూల్ బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. వీటికి తప్పకుండా ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉండాల్సిందే అని ఇప్పటికే ఆర్టీఏ అధికారులు చెప్పుకొచ్చారు. వాస్తవానికి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి పిల్లలను తీసుకెళ్లే వెహికిల్స్ కు ఫిట్నెస్ చేయించాల్సి ఉంది. ఇందుకోసం రవాణా శాఖ అధికారులు వాహనాల సామర్థ్య పరీక్షల గడువు మే 15వ తేదీ వరకు ఇచ్చారు. ఒక వైపు విద్యాసంస్థలు ప్రారంభమైనా ఇంకా ఉమ్మడి జిల్లాలో 25 శాతానికి పైగా బస్సులకు ఫిట్నెస్ చేయించాల్సి ఉందని రవాణాశాఖ అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version