మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన శ్రీ నలంద పాఠశాల స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. దంతాలపల్లి మండల కేంద్రం శివారులో అదుపుతప్పి స్కూల్ బస్సు బోల్తా పడింది.
బొడ్లాడ గ్రామంలో విద్యార్థులను తీసుకు రావడానికి వెళుతుండగా మూలం మలుపు వద్ద ఈ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. డ్రైవర్ అతివేగం వల్ల బోల్తా కొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్ బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే.. ఈ ప్రమాదంలో స్వల్పగాయలతో విద్యార్థులు బయటపడ్డారు. ఇక అటు స్కూల్ బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.