Seetharama Project Motor Trail Run Success: సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయిల్ రన్ సక్సెస్ అయింది. గత కేసీఆర్ ప్రభుత్వంలో 17 వేల కోట్ల అంచనాతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయిల్ రన్ సక్సెస్ అయింది. ఉమ్మడి ఖమ్మం మరియు మహబూబాబాద్ జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు అందనున్న సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయిల్ రన్ సక్సెస్ అయింది.

కాగా, సీతారామ ప్రాజెక్టు సంబంధించి మోటార్ల టైలరింగ్ గత రాత్రి అశ్వాపురం మండలం పీజీ కొత్తూరు వద్ద సక్సెస్ అయింది. ముందుగా ప్రాజెక్టు నిర్మాణాన్ని 13 వేల కోట్ల కి టెండర్లు పిలిచినప్పటికీ ఆ తర్వాత నిర్మాణ వ్యయం పెరగడంతో మొత్తం 17 వేల కోట్లకి పెరిగింది ఖమ్మం జిల్లాలో 4 లక్షల ఎకరాలకు భద్రాద్రి జిల్లాలో మూడు లక్షల ఎకరాలకి మహబూబాద్ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకి సాగునీరు అందనుంది. ఇక దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు రైతులు.