సిగ్గు లేకుండా ఒక స్త్రీపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు – వైయస్ షర్మిల

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎడమ కాలనీ గాయమైన సంగతి తెలిసిందే. దీంతో మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించగా.. ఓటిటి షోలు చూడడానికి సలహా ఇస్తారా అంటూ కేటీఆర్ చేసిన ట్విట్ పై వైయస్ షర్మిల సెటైర్ వేసిన సంగతి తెలిసిందే. దీంతో అధికార పార్టీ నుండి వైయస్ షర్మిలకు కౌంటర్లు కూడా వచ్చాయి. అయితే వీటిపై స్పందించారు వైఎస్ షర్మిల.ఓటీటీలో సినిమాల కోసం స‌ల‌హా అడిగితే మేం వెట‌కారంగా ట్వీట్ చేశామని అన్నారు.

“దానికి చిన్న దొర గారికి కోపం వ‌చ్చింది. మా పై వ్య‌క్తిగ‌తంగా విరుచుకుప‌డ్డారు. ద‌మ్ముంటే స‌బ్జెక్టు మాట్లాడండి. అధికారం చేతుల్లో ఉంది, పాల‌న చేతుల్లో ఉంది, ఇంట్లో కూర్చుని షోలు, సినిమాలు చూస్తారా?. ఇంట్లో నుంచి రిమోట్‌గా ప‌ని చేయ‌లేరా? క‌రోనా స‌మ‌యంలో మ‌న‌మంద‌రం ప‌ని చేయ‌లేదా? వ‌ర‌ద‌లొచ్చి ఒక ప‌క్క రైతులు న‌ష్ట‌పోయారు, ఇండ్లు కోల్పోయారు. వాళ్ల‌కు ఒక్క రూపాయి సాయం చేయ‌లేదు. ఓటీటీ సినిమాలు చూస్తార‌ట‌. ప్ర‌జ‌ల‌కు ఏం హామీలిచ్చి అదికారంలోకి వ‌చ్చారు, ఏ హామీలు నెర‌వేర్చ‌కుండా సిగ్గు లేకుండా ఒక స్త్రీపై పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేస్తున్నారు”. అంటూ షర్మిల మండిపడ్డారు.