బంగారు తెలంగాణాలో అమ్ముకతినుడు, దోచుకతినుడే : షర్మిల ఫైర్‌..

వైఎస్‌ఆర్టీపీ పార్టీ అధినేత షర్మిల ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటూనే.. సీఎం కేసీఆర్ ను టార్గెట్‌ చేస్తారు. ఏదో ఒక సమస్యను.. ఎత్తి చూపుతూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తారు. కేసీఆర్‌ ప్రభుత్వంపై వైఎస్‌ఆర్టీపీ పార్టీ అధినేత షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగారు తెలంగాణాలో అమ్ముకతినుడు, దోచుకతినుడే అంటూ షర్మిల ఫైర్‌ అయ్యారు.

రియల్ ఎస్టేట్ దోపిడీ నుంచి పేద మధ్య తరగతి ప్రజలను కాపాడి, వారి సొంతింటి కలను నెరవేర్చాలని సంకల్పించి, మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే ఇండ్లను అందివ్వాలని రాజీవ్ స్వగృహను రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేస్తే, దొరగారేమో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించుడు పక్కన పెట్టి, మధ్యతరగతి బతుకులు ఎప్పుడు ఇండ్లు లేకుండానే ఉండాలని, కమిషన్ల కోసం, ఖజానా నింపుతం అన్న వంకతో, తన మిత్ర బృందానికి, రియల్ ఎస్టేట్ భజన బ్యాచ్ కు టవర్ల లెక్కన రాజీవ్ స్వగృహ ఇండ్లను వేలానికి పెట్టి జేబులు నింపుకుంటున్నాడని వైఎస్‌ షర్మిల నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్‌ గారి బంగారు తెలంగాణ అంటే అమ్ముకతినుడు.అందినకాడికి దోచుకునుడే కదా! అంటూ ట్వీట్‌ చేశారు వైఎస్‌ షర్మిల.