నాది ఆంధ్ర అయితే..మరి సోనియా గాంధీ ఎక్కడ..? – రేవంత్‌ పై షర్మిల సీరియస్‌

-

నాది ఆంధ్ర అయితే..మరి సోనియా గాంధీ ఎక్కడ..? అంటూ రేవంత్‌ పై షర్మిల సీరియస్‌ అయ్యారు. సోనియా గాంధీది ఇటలీ కదా… ఒక ప్రాంతాన్ని వదిలేసి.. సొంత వాళ్ళను కాదు అనుకొని… ఒక మహిళ పెళ్లి చేసుకున్నందుకు ..బిడ్డలను కానీ తనని తానే అంకితం చేస్తుంది మహిళ అంటూ పేర్కొన్నారు. ఇది మన దేశ సంస్కృతి, గొప్పదనం అని షర్మిల పేర్కొన్నారు.

ఇంత గొప్ప సంస్కృతిని అర్థం చేసుకోవాలి అనుకుంటే సంస్కారం ఉండాలని ఫైర్‌ అయ్యారు. ఇంతటి సంస్కారం రేవంత్ రెడ్డికి లేదు… నాకు చీర, సారే పెడతాడట.కానీ ఇక్కడ రాజకీయాలు చేయొద్ధట అంటూ చురకలు అంటించారు. ఈ లెక్కన సోనియా గాంధీకి రేవంత్ రెడ్డికి చీర, సారే పెడతాం ..రాజకీయాలు చేయొద్దు అని చెప్పే దమ్ముందా.. అని నిలదీశారు షర్మిల. రేవంత్ రెడ్డి అభద్రతగా ఫీల్ అవుతున్నారు.. నా వల్ల తన ఉనికి ఎక్కడ పోతుందో అని భయం అంటూ ఎద్దేవా చేశారు. అందుకే రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడని చురకలు అంటించారు. తెలంగాణ లో ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ YSRTP అని.. తెలంగాణ అనే పదం ఉన్న పార్టీ YSRTP అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news