నష్టపోయిన రైతులకు రూ.30 వేలు ఇవ్వాల్సిందే – షర్మిల

-

పంట నష్టపోయిన రైతులకు రూ.30 వేలు ఇవ్వాల్సిందేనని షర్మిల పేర్కొన్నారు. జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపూర్ గ్రామంలో పంట నష్టాన్ని పరిశీలించారు వైఎస్ షర్మిల. చేతికొచ్చిన వరి పంట పూర్తిగా నేల పాలయ్యిందని షర్మిల ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు రైతులు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ… జనగాం జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని.. చేతికొచ్చిన పంట మొత్తం నేల పాలయ్యిందన్నారు.

ఇంత నష్టం జరిగినా కేసీఅర్ ఒక్క ఎకరాకు కూడా పరిహారం ఇవ్వలేదని.. గత నెల 23 న హెలికాప్టర్ లో వచ్చాడని.. 10 వేల సహాయం అంటూ ప్రకటన చేశాడని ఎద్దేవా చేశారు. 10 వేలు అంటూ చెప్పి నెల రోజులు దాటినా ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదు.. గత 9 ఏళ్లుగా దాదాపు 14 వేల కోట్ల పంట నష్టం జరిగిందని వివరించారు. ప్రతి ఏటా 1500 కోట్ల నష్టం జరుగుతుంది.. ముష్టి రైతు బందు ఇచ్చి కేసీఅర్ రైతును ఉద్ధరించినట్లు బిల్డప్ ఇస్తున్నాడని ఆగ్రహించారు. కేసీఆర్ రైతు ద్రోహి.. ఒక్కో ఎకరాకు 30 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు లబో దిబో అంటున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news