ఎవరైనా చనిపోతే హిందూ సంప్రదాయ ప్రకారం కొన్ని పట్టింపులు ఉంటాయి. వాటి ప్రకారం మనిషి దహన సంస్కారాలను పూర్తి చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కో సాంప్రదాయం ఉంటుంది దాన్ని బట్టి ఈ కార్యక్రమాల్ని పూర్తి చేస్తారు. మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషి తాలూకా వస్తువులను బట్టలని కొంత మంది కాల్చేస్తూ ఉంటారు ఎందుకు అలా కాల్చాలి దాని వెనక కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మనిషి చనిపోయిన తర్వాత చాలా మంది వారి యొక్క బట్టలని కలుస్తూ ఉంటారు ప్రతి ఒక్క మనిషి కూడా కొన్ని వస్తువుల్ని ఉపయోగిస్తారు దువ్వెన చెప్పులు ఇలా.. ప్రతీ ఒక్కరికీ కూడా అవసరమైన వస్తువులు ఉంటాయి. ఎప్పుడైనా కూడా ఒక మనిషి ఉపయోగించే వస్తువులు మరొక మనిషి ఉపయోగించకూడదు. ఎందుకంటే దోషాలు వీటి ద్వారా మరొకరికి చేరుతాయి. కేవలం దోషాలే కాదు అనారోగ్య సమస్యలు కూడా ఒకరి నుండి మరొకరికి చేరతాయి. వైరస్ లాంటివి ఒకరి నుండి ఒకరికి సోకుతాయి అందులో సందేహం లేదు.
ఒకరు వాడిన వస్తువుని మరొకరు వాడడం వలన నెగిటివ్ ఫీలింగ్స్ కూడా వస్తువుల ద్వారా ప్రవేశిస్తూ ఉంటాయి ఇలా ఒకళ్ళ వస్తువుల నుండి ఇంకొకరికి వ్యాపిస్తాయి కాబట్టి చనిపోయిన వారి వస్తువులను ఉపయోగించకూడదని.. వాళ్ల బట్టల్ని కాల్చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఇతరుల చెప్పులు కానీ దువ్వెన వంటివి వాడకూడదు. ఇలా ఉపయోగించడం వలన నెగటివ్ ఫీలింగ్స్ మాత్రమే కాదు అనారోగ్య సమస్యలు కూడా స్ప్రెడ్ కావచ్చు. పుణ్య ఫలం కానీ కర్మ ఫలితం కానీ ఒక మనిషి నుండి ఇంకో మనిషికి చేరుతుంది అందుకని చనిపోయిన వాళ్ళ బట్టల్ని కాలుస్తారు.