కేసీఆర్‌కు షాక్‌..కాళేశ్వరంపై కాగ్‌కు షర్మిల ఫిర్యాదు

సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి కునుకు లేకుండా చేస్తోంది వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ అధినేత వైఎస్‌ షర్మిల. ఇప్పటికే కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతి చేసిందని.. సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్‌ షర్మిల.. తాజాగా మరో సంచలన నిర్నయం తీసుకుంది.

తాజాగా గిరీష్ చంద్ర ముర్ము కాగ్ డైరెక్టర్ ను కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ పిర్యాదు చేసింది వైఎస్ షర్మిల. వెంటనే కేసీఆర్‌ సర్కార్‌ పై చర్యలు తీసుకోవాలని కోరింది షర్మిల.
ఇక అటు ఏండ్లుగా రాష్ట్రాన్ని పట్టించుకోని కేసీఆర్, ఢిల్లీలో మకాం వేస్తే.. మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో ఓట్లు కొనడానికి వెళ్లారు. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటేనో, ఒక నిరుద్యోగి చచ్చిపోతేనో, పంట నష్టపోతేనో పట్టించుకోని ఎమ్మెల్యేలు.. సిగ్గు విడిచి ఒక్క ఉప ఎన్నిక కోసం కట్టకట్టుకుని పోయారని ఆగ్రహించారు.