లీకేజీ కేసులో KTR ని కాపాడేందుకే సిట్ ప్రయత్నం – వైఎస్ షర్మిల

-

రాష్ట్రంలో నిరుద్యోగులకు మద్దతుగా అఖిలపక్ష నాయకులతో నేడు ఇందిరాపార్కు వద్ద టీ – సేవ్ పేరుతో నిరాహార దీక్ష చేపట్టారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. ఈ సందర్భంగా టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీ పై సీట్ తో కాకుండా సి.బి.ఐ తో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షకు పలువురు అఖిలపక్ష నేతలతో పాటు ప్రజా యుద్ధనౌక గద్దర్ కూడా హాజరై తన మద్దతును ప్రకటించారు. అయితే దీక్ష సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. పథకం ప్రకారమే తనని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ లో మంత్రి కేటీఆర్ ను కాపాడేందుకే సిట్ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు షర్మిల. సీట్ అధికారులను ప్రగతి భవన్ గుప్పెట్లో పెట్టుకుందని.. ప్రభుత్వానికి దమ్ముంటే సిబిఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. అన్ని శాఖలలో వాడే కంప్యూటర్లకు ఐటి శాఖదే బాధ్యత అన్నారు షర్మిల. ఐటీ శాఖ సైబర్ సెక్యూరిటీ ఆడిట్ ఎప్పుడైనా చేసిందా అని ప్రశ్నించారు. కెసిఆర్ కుటుంబం మొత్తం స్కాంలతో కూరుకుపోయిందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news