కరెంట్ బిల్లు కట్టలేని దద్దమ్మ ప్రాజెక్టులు కడతాడా..? – నారా లోకేష్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర నేటికీ 81వ రోజుకు చేరుకుంది. ఈరోజు మంత్రాలయం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర జరుగుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్ పై మండిపడ్డారు నారా లోకేష్. కరెంటు బిల్లు కట్టలేని దద్దమ్మ ప్రాజెక్టులు కడతాడా?! అని దుయ్యబట్టారు.

“ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసమర్థత, చేతగానితనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి కర్నూలు జిల్లాలో పాడుబడ్డ ఎత్తిపోతల పథకాలు. తుంగభద్ర ఎల్ఎల్ సి ద్వారా సాగునీరు సరిగా అందని 51వేల ఎకరాల ఆయకట్టు రైతులకోసం గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పరిధిలో 9 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించాం. ఈ పథకాలకు సంబంధించి విద్యుత్, నిర్వహణ బిల్లులు రూ.134 కోట్లను చెల్లించకలేక పాడుబెట్టింది వైసిపి ప్రభుత్వం. ఫలితంగా ప్రాజెక్టు పరిధిలోని వేలాది రైతులు సాగునీరు అందక నానా అవస్థలు పడుతున్నారు. కరెంటు బిల్లులు కట్టలేని చేతగాని దద్దమ్మ జగన్ ప్రాజెక్టులు కడతానంటే ఎలా నమ్మాలి?” అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news