ధరణి పోర్టల్ ను తొలగిస్తేనే సామాజిక తెలంగాణ ఏర్పడుతుంది – భట్టి విక్రమార్క

-

ధరణి పోర్టల్ ను తొలగిస్తేనే సామాజిక తెలంగాణ ఏర్పడుతుందన్నారు సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఉత్పత్తి రంగం కొద్ది మంది చేతుల్లో ఉంటే.. మిగతా ప్రజలు వారిపై ఆధారపడాల్సి ఉంటుందన్నారు. గతంలో భూమి ఒక్కటే ఉత్పత్తి రంగంగా ఉన్నప్పుడు పేదప్రజలకు భూమిని పంచిన చరిత్ర కాంగ్రెస్ దిని అన్నారు. తెలంగాణలో ఏ పోరాటం చూసినా భూమికోసం జరిగినవేనన్నారు. స్వతంత్ర భారత దేశంలో పోరాటాల లక్ష్యాలకు భిన్నంగా రాష్ట్రంలో చట్టాలు తీసుకొచ్చిందన్నారు.

పేదలకు పంచిన భూములను ధరణి చట్టంలోకి రాకుండా పక్కన పెట్టిందని ఆరోపించారు. వారికి పాస్ బుక్ లు, పట్టాలు ఇవ్వడంలేదన్నారు. కాస్తు కాలమ్ ను తొలగించి భూమిని భూస్వాములకు అప్పగించిన పరిస్థితి నెలకొందన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అన్నారు భట్టి విక్రమార్క. పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో కేసీఆర్ ను నిలదీశామన్నారు. ఫ్యూడల్ వ్యవస్థను, భూస్వామ్య విధానాన్ని బీఆరెస్ మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే… కాస్తు కాలమ్ తో పాటు ఇతర కాలమ్స్ ను మళ్లీ చేరుస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news