హైదరాబాద్ లో భారీ వర్షం.. పలు ప్రాంతాల్లోకి చేరిన వరద నీరు

నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి వ్యాపించాయి. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మరికొన్ని రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్. నాంపల్లి, బషీర్ బాగ్, అబిడ్స్, కోటి, అంబేర్ పేట్, బేగంబజార్, కొండాపూర్, మాదాపూర్, మియాపూర్, చందానగర్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. 

పాతబస్తీలో వర్షాల వల్ల వదలు ఏర్పడి ముంపు ప్రాంతాల్లోకి భారీగా ఇళ్లలోకి వరదనీరు చేరింది. ఛత్రినాక, శివగంగా నగర్, శివాజీ నగర్ లలో వరద నీరు రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. బుధవారం కురిసిన వర్షం కారణంగా చంద్రాయణ గుట్ట ప్రాంతంలో భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు వ్యాపించడంతో మరికొన్ని రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో నైరుతి రుతుపవనాలకు అనుకూలమైన పరిస్థితులు ఉండటంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశంుంది.