గుడ్​న్యూస్.. తెలంగాణలో త్వరలోనే క్రీడాపాలసీ

-

ఐటీ, వ్యవసాయం, సాగు.. ఇలా ప్రతి రంగంలో దూసుకెళ్తున్న తెలంగాణ క్రీడా రంగంలోనూ సత్తా చాటేందుకు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే సీఎం కప్ పోటీలు నిర్వహించి క్రీడా శాఖ త్వరలోనే రాష్ట్రంలో క్రీడా పాలసీ తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ విషయాన్ని ఆ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా ప్రకటించారు.

తెలంగాణ వ్యాప్తంగా 16,300 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు వచ్చాయని, ఇలా దేశంలో మరే రాష్ట్రంలో లేవని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. సీఎం కప్‌-2023 తెలంగాణ క్రీడాసంబురాల వేడుక హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో సోమవారం రాత్రి వైభవంగా జరిగింది. రాష్ట్రంలో ఇంత గొప్పగా క్రీడా సంబురాలు జరుగుతుంటే దిల్లీలో క్రీడాకారుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ.. అవమానిస్తున్నారని మంత్రి ఆరోపించారు. ‘ఉప్పల్‌ స్టేడియం తెలంగాణ సొత్తు. అక్కడి సంఘ సభ్యులు అవినీతిలో కూరుకుపోయి, కేసులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రాన్ని అప్రతిష్ఠపాలు చేసే వారెవరైనా కఠినంగా శిక్షించాలి’ అని అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news