జై తెలంగాణ అనని వ్యక్తి సీఎంగా ఉండడం మన దురదృష్టం : రవి శంకర్

-

తెలంగాణలో పుట్టిన రేవంత్ రెడ్డి జై తెలంగాణ ఎందుకు అనడం లేదు. జై తెలంగాణ అనని వ్యక్తి సీఎం గా ఉండడం మన దురదృష్టం అని చొప్పదండి మాజీ ఎమ్మేల్యే సుంకె రవి శంకర్ తెలిపారు. నిన్నటి సీఎం సభ రాజకీయ సభ లాగా ఉంది. రేవంత్ రెడ్డి కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లు  తలుచుకోకుండ ఒక్కసారన్న మాట్లాడినరా. ఊరి సిల్లను సిరిసిల్ల గా మార్చింది కెసిఆర్ మాత్రమే. మళ్ళీ ఊరి సిల్ల గా ఈ ప్రభుత్వం మార్చేలా ఉంది. పవిత్ర దేవస్థానం ప్రాంతలో ఉంది సుందిళ్ళ, కాళేశ్వరం ప్రాజెక్ట్ లు కూలిపోయాయని అంటున్న రేవంత్ రెడ్డి మాట్లాడేది అన్ని అబద్ధాలే. కెసిఆర్ ఇచ్చిన నీళ్ళతో 3 లక్షల కోట్ల టన్నుల ధాన్యం పండింది. దేశానికి అన్నం పెట్టేలా తెలంగాణ రాష్ట్రం తయారైంది కెసిఆర్ హయంలోనే.

కానీ రాజన్నను మోసం చేసింది రేవంత్ రెడ్డి. రాజన్న దేవాలయం 24 ఎకరాల్లో ఉంటే కెసిఆర్ ప్రభుత్వంలో 33 ఎకరాలకు పెంచుకున్నాం. కెసిఆర్ ప్రభుత్వంలో కట్టిన బిల్డింగ్లకు సున్నం వేసి మేము కట్టినట్లుగా చూపిస్తున్నారు. గత ప్రభుత్వంలో అనేక ఉధ్యోగాలు ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో చెప్పాలి. మా ప్రభుత్వంలో 1 కోటి 60 వేయిల ఉద్యోగాలు ఇచ్చాం. రాజన్న దేవస్థానంలో 24 గంటల నీళ్లు ఉండేలా వసతి కల్పించాం. యాదగిరి గుట్టకు వెళ్లిన రేవంత్ రెడ్డి కట్టిన గుడిని చూసి బిత్తర చూపులు చూశాడు అని సుంకె రవి శంకర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version