మోడీ క్షమాపణలు చెప్పాలి..లేదంటే దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తాం : తలసాని

-

ప్రధాని మోదీ తెలంగాణకు క్షమాపణ చెప్పాలి. వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. లేదంటే దేశ వ్యాప్తంగా ఉద్యమిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ వార్నింగ్‌ ఇచ్చారు. ప్రధాని తెలంగాణ పై తన అక్కసు వెళ్లగక్కారని… బడ్జెట్ మీద ప్రసంగించాల్సిన ప్రధాని ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు. దేశంలో తెలంగాణ ఉందొ, లేదో అన్నట్లు కేంద్రం వ్యవహరిస్తోందని.. దుర్మార్గంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు.

రాజ్యాంగం ప్రకారం విభజన జరిగినప్పుడు… విభజన హామీలను ఏమి చేశారని.. అఖిలేష్ యాదవ్ గెలిస్తాడనే భయంతో ప్రధాని మోడీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. దేశంలో నరేంద్ర మోడీ రాజ్యాంగం నడుస్తోందని.. ప్రజాస్వామ్యంలో నియంత పాలన నడవదన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ లో ఎస్పీ గెలుస్తుందని ఐబీ రిపోర్టు ఇవ్వడంతో కాశీ, అయోధ్యలో, చినజీయర్ ఆశ్రమంలో మోడీ డ్రామాలు చేశారని.. పార్లమెంటులో డ్రామాలు స్టార్ట్ చేసాడని చురకలు అంటించారు. బీజేపీ నాయకులు కుక్కల్లాగా మాట్లాడుతున్నారు. రాజ్యాంగం గురించి నోటికి వచ్చినట్టు వాగుతున్నారని.. సింగరేణి జోలికి వస్తే తెలంగాణ భగ్గు మంటది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దాన్ని అమ్మాలని చూస్తున్నారని మండిపడ్డారు. రైతుల పైకి కారెక్కించి తొక్కించి చంపిన దుర్మార్గపు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news