గద్దర్ అంత్యక్రియల్లో వివాదం చోటు చేసుకున్న విషయంపై మంత్రి తలసాని క్లారిటీ ఇచ్చారు. గద్దర్ మరణం తెలంగాణ సమాజానికే తీరని లోటు అన్నారు మంత్రి తలసాని. గద్దర్ కు మంత్రి తలసాని నివాళులు అర్పించి…మీడియాతో మాట్లాడారు. తన గానంతో తెలంగాణ ప్రజానీకానికి చైతన్యం కలిగించాడు..తన వేషధారణ చూస్తేనే అర్థమవుతుంది.. ఎంత నిరాడంబరంగా జీవించాడో అంటూ కొనియాడారు.
కొందరు ఇక్కడ కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు.. మంచి పద్ధతి కాదన్నారు.గద్దర్ ఒక పార్టీ నేత కాదు.. ప్రజా నాయకుడు.. తెలంగాణ గొంతుక… పద్ధతి మానుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో గద్దర్ కూడా కీలక వ్యక్తి అని వెల్లడించారు మంత్రి తలసాని. అలాంటి వ్యక్తికి ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు చేయాలని సీఎం కెసిఆర్ నిర్ణయించారని..దీన్ని కూడా కొందరు తప్పుపడుతున్నారని ఫైర్ అయ్యారు. గొప్ప వ్యక్తికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న గౌరవం గా భావించాలన్నారు తలసాని.