గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్‌కు మధ్య విభేదాలు బయటపడుతున్న విషయం తెలిసిందే. ప్రగతి భవన్‌కు, రాజ్‌భవన్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఆహ్వానం పంపడం లేదు. ఈ క్రమంలో గవర్నర్ కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బహిరంగంగానే విరుచుకుపడుతున్నారు. తాజాగా మరోసారి సర్కార్‌పై తమిళిసై విమర్శలు గుప్పించారు.
అభివృద్ధి అంటే ఒకే కుటుంబం కోసం కాదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కేవలం ఒక్క కుటుంబమే కాదు.. ప్రజలందరూ అభివృద్ధి చెందాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. జీ-20 సమావేశాల్లో భాగంగా సి-20 సమాజ్‌శాల కార్యక్రమంలో పాల్గొన్న తమిళిసై ఈ విధంగా వ్యాఖ్యానించారు. ‘‘కొంత మంది మాట్లాడుతారు కానీ పని చేయరు. దేశాధినేతలనైనా కలవొచ్చు.. ఈ స్టేట్ చీఫ్‌ని మాత్రం కలవలేం. నన్ను నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి పిలవలేదు. ప్రగతి భవన్.. రాజ్‌భవన్ దూరంగా ఉంటున్నాయి’’ అని గవర్నర్ పేర్కొన్నారు.