అడవుల విస్తీర్ణంలో.. దేశంలోనే తెలంగాణ నంబర్ వన్

-

తెలంగాణ రాష్ట్రం మరో ఘనతను దక్కించుకుంది. అడవుల విస్తీర్ణంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2019-21 మధ్యకాలంలో పెరిగిన విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకొని ‘ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌-2021’లో ఈ విషయాన్ని ప్రస్తావించారని ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదికలో పేర్కొన్నారు.

2015లో తెలంగాణ 19,854 చదరపు కి.మీ. అటవీ విస్తీర్ణం ఉండగా.. 2019 నాటికి 20,582 చదరపు కి.మీ.లకు పెరిగింది. 2021 నాటికి 21,214 చదరపు కి.మీ.లకు చేరుకుంది. 2019-21 కాలంలో రాష్ట్రంలో ఏకంగా 632 చదరపు కి.మీ.(3.07 శాతం) అడవులు విస్తరించాయి. ఇదేసమయంలో దేశవ్యాప్తంగా అటవీ ప్రాంతంలో పెరుగుదల 1,540 చదరపు కి.మీ.లు(0.22 శాతం) మాత్రమే నమోదు కావడం గమనార్హం.

రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. జిల్లాలో 4,311.38 చదరపు కి.మీ.లలో అడవులు విస్తరించాయి. 2,939.15 చదరపు కి.మీ.(10.89 శాతం)తో ములుగు రెండో స్థానంలో.. 2,496.68 చదరపు కి.మీ.(9.26 శాతం)తో నాగర్‌కర్నూల్‌ మూడో స్థానంలో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news