కేసీఆర్, జగన్ భేటీ…? కారణం ఇదే…?

Join Our Community
follow manalokam on social media

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే సమావేశమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా జల వనరుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. వచ్చేది వేసవికాలం కావడంతో ఆంధ్రప్రదేశ్ లో నీటి కొరత కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యే అవకాశాలు ఉండవచ్చని తెలుస్తోంది. వీరిద్దరి భేటీ ఏప్రిల్ రెండో వారంలో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ జిల్లాల్లో నీటి కొరత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణ సహకారం కోరే అవకాశాలు ఉండవచ్చని ఏపీ ప్రభుత్వ వర్గాలంటున్నాయి. దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేసి పెట్టుకుంది.

సీఎం కేసీఆర్ వద్ద వాటిని జగన్ ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయని ఏపీ మీడియా వర్గాలు అంటున్నాయి. ముగ్గురు మంత్రులతో కలిసి జగన్, సీఎం కేసీఆర్ తో సమావేశమై అవకాశాలున్నాయి. అలాగే రాష్ట్ర అధికారులు కూడా ఒకసారి భేటీ అయ్యే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తి పంపకాల విషయంలో కూడా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించే విషయంలో చేతులెత్తేయడంతో సీఎంలు పరిష్కరించుకునే అవకాశాలు కనబడుతున్నాయి.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...