ఒడిస్సాలో కల్తీ మద్యం తయారీ స్థావరంపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ దాడులు

-

నకిలీ మద్యం కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు..దాని గుట్టు రట్టు చేశారు. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్, సరూర్ నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రావు ఒడిస్సాతో పాటు తెలంగాణలో తనిఖీలు చేశారు.

నకిలీ మద్యం తయారీదారు సమచారం మేరకు ఒరిస్సాకు వెళ్లిన మూడు ప్రత్యేక బృందాలు…ఒరిస్సాలో నకిలీ మద్యం కేంద్రాన్ని గుర్తించి ద్వంసం చేశారు. ఈ నేపథ్యంలోనే, 300 కేసుల నకిలీ మద్యం, ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇందులో ముగ్గురు ఒరిస్సా వాసులు, ఇద్దరు తెలంగాణ వాసులు ఉన్నారని గుర్తించారు పోలీసులు. మునుగోడు ఎన్నికల సమయంలో నకిలీ మద్యం సరఫరా పై ఎక్సైజ్ అధికారుల పాత్రపై అంతర్గత విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news