సికింద్రాబాద్ ఘటన.. అగ్నిమాపక శాఖ నివేదికలో విస్తుపోయే అంశాలు

-

సికింద్రాబాద్‌లోని డెక్కన్‌ స్పోర్ట్‌ నిట్‌వేర్‌ మాల్‌లో గురువారం జరిగిన అగ్నిప్రమాద ఘటనపై అగ్నిమాపక శాఖ అందించిన ప్రాథమిక నివేదికలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ భవనంలో అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలింది. భవనానికి రెండు సెల్లార్లు, గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు అయిదు అంతస్తులు ఉన్నా సరైన నిర్వహణ సామర్థ్యం లేకపోవడంతోనే ప్రమాద తీవ్రత పెరిగినట్లు వెల్లడించారు.

ప్రధాన లోపాలేంటంటే..

భవనంలోని అంతస్తులకు రెండు మెట్లమార్గాలు ఉండాలి. ఒకటి మాత్రమే ఉంది.

భవనానికి సెట్‌బ్యాక్‌ లేదు. అగ్నిమాపక యంత్రాలు తిరిగేందుకు ఇది ప్రతిబంధకంగా మారింది.

భవనం లోపలి వైపు సరైన వెలుతురు లేదు. ఈ కారణంగా అగ్నిమాపక సిబ్బంది లోపలికి ప్రవేశించడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. సిబ్బంది ఫైర్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ ధరించి భవనం పై అంతస్తు నుంచి లోపలికి వెళ్లాల్సి వచ్చింది.

భవనంలో అత్యవసర వెలుతురు.. పొగ నిర్వహణ సదుపాయం లేదు.

బేస్‌మెంట్‌ను వాణిజ్య కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం.

Read more RELATED
Recommended to you

Latest news