రైతుబంధు నిధుల కోసం అప్పు చేసిందట తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రైతుబంధు కోసం కొంత అప్పు చేసిందని సమాచారం. యసంగి సీజన్ రైతుబంధు వేయడానికి రూ.7,625 కోట్ల నిధులు అవసరం కాగా.. ఇప్పటివరకు ఎకరం లోపు 21 లక్షల మంది రైతులకు రూ.1,050 కోట్లు జమ చేశారు.
మిగతా నిధుల కోసం కేంద్రం వద్ద 13 వేల కోట్ల రూపాయలు రుణం అడగగా 9 వేల రుణం తీసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అందులో 2 వేల కోట్లు ఈనెల 16న వచ్చే అవకాశం ఉంది. దీంతో కొంత వరకు రైతుబంధు నిధులు వేసే అవకాశం ఉంది.