ఇళ్లు కట్టుకునే వారికి కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త..

-

ఇళ్లు కట్టుకునే వారికి కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. మరో నెలలోనే ఇంటి అడుగు జాగలో ఇళ్లు కట్టుకునేందుకు 3 లక్షలు అందిస్తామని మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. సిద్దిపేట జిల్లా, ధూల్ మిట్ట మండలం కొండాపూర్ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్లకు, అనంతరం మద్దూర్ మండలం నర్సాయపల్లి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్, మహిళా మండలి భవనం, అంగన్ వాడీ భవనం, సీసీ రోడ్లు మరియు డ్రైనేజ్ నిర్మాణ పనులకు జనగామ ఎమ్మెల్యే శ్రీ ముత్తిరెడ్డి యాదిరెడ్డి గారితో కలసి రూ. 70 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు హరీష్‌ రావు.

cm-kcr-telangana
cm-kcr-telangana

ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. నర్సాయపల్లి గ్రామ పంచాయతీ కోసం రూ.50 లక్షలు నిధులు మంజూరు చేస్తామని.. నర్సాయపల్లి గ్రామానికి పల్లె దవాఖాన మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అభయ హస్తం కట్టిన డబ్బులు మిత్తితో చెల్లింపులు చేస్తాం. నెలరోజుల్లో 57 ఏళ్లకే వృద్ధులకు వృధ్యాప పింఛన్లు, ఇస్తామని వెల్లడించారు. పైసా ఖర్చు లేకుండా గ్రామంలో మోకాలి చిప్ప ఆపరేషన్లు, క్యాటారాక్ట్ కంటి ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తానని.. చేర్యాల, ధూల్ మిట్ట, మద్దూర్, కొమురవెళ్లి మండలాల్లో రోడ్లు నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేసామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news