జులై 6న తెలంగాణ ఇన్నోవేషన్‌ సమ్మిట్‌

-

తెలంగాణలో సరికొత్త ఆవిష్కరణలు చేయడానికి ముందుకొచ్చే ఔత్సాహికుల కోసం టీ హబ్ వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే జులై 6వ తేదీన తెలంగాణ ఇన్నోవేషన్ సమ్మిట్​ను నిర్వహిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత మేధావులుగా గుర్తింపు పొందిన ముగ్గురు శాస్త్రవేత్తలతో ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. యూకేకు చెందిన గణిత మేధావి సర్‌ మార్కస్‌ డు సౌటాయ్‌, న్యూరో సైంటిస్టు అనిల్‌ సేథ్‌, కెన్యాకు చెందిన పాలియో అంత్రపాలజిస్టు లూయిస్‌ లీకీ ఈ సమ్మిట్‌కు హాజరవుతున్నారు.

‘గ్లాడియేటర్స్‌ ఆఫ్‌ ది మైండ్‌’ పేరుతో హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రతిష్ఠాత్మకంగా ఈ సమ్మిట్​ నిర్వహిస్తున్నామని టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ హాజరై ప్రసంగించనున్నారని వెల్లడించారు. ఆవిష్కరణల్లో తెలంగాణను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు వీలుగా ప్రసిద్ధ శాస్త్రవేత్తలు.. స్టార్టప్‌ వ్యవస్థాపకులతో సమావేశమయ్యేందు ఈ సమ్మిట్ సహకరిస్తుందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news