తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం, జీఎస్డీపీ మొదలైన ఆర్థిక అంశాల్లో దేశంలోనే మెరుగైన పరిస్థితిలో ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మంచి పనితీరు కనబరుస్తోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రే… తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ గా ఉందని అన్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో వేగంగా పట్టణీకరణ జరుగుతోంది. పట్టణ జనాభా వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఆరంభం నాటికి తెలంగాణలో 1.79 కోట్లు అంటే దాదాపుగా 46.84 శాతం మంది ప్రజలు పట్టణాల్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో పట్టణ జనాభా శాతం 34.75 ఉంది. అంటే తెలంగాణ పట్టణ జనాభా దేశం పట్టణ జనాభా కన్నా 12 శఆతం అధికంగా ఉంది. 2036 నాటికి రాష్ట్రంలో పట్టణ జనాభా 2.20 కోట్లకు చేరుతుందని భావిస్తున్నారు. 2036 నాటికి దేశ సగటు కన్నా తెలంగాణ పట్టణ జనాభా 18 శాతం అధికంగా ఉండవచ్చని అంచనా. రాష్ట్రంలో పట్టణ జనాభాలో హైదరాబాద్, మెడ్చల్ జిల్లాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.