హైదరాబాద్‌లో ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్లు !

-

ట్రాన్స్‌జెండ‌ర్ల సంక్షేమం కోసం సీఎం రేవంత్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలిసారిగా ట్రాన్స్‌జెండ‌ర్ల సంక్షేమం, వారి కోసం ప్ర‌త్యేకంగా ప్ర‌భుత్వ నియామ‌కాల ప్ర‌క్రియ‌ను ప్రారంభించనున్నారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి. ట్రాన్స్‌జెండ‌ర్ల విషయంలో ఇంత‌టి కీల‌క‌మైన అడుగు భార‌త‌దేశంలోనే కాదు ప్ర‌పంచంలోనే ఎక్క‌డా లేదని అంటున్నారు. ట్రాన్స్‌జెండ‌ర్ల‌కు ఉపాధి క‌ల్ప‌న‌, హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు సీఎం రేవంత్‌.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్లు !

హైద‌రాబాద్‌లోనే అతి తక్కువ ట్రాఫిక్ జామ్ స‌మ‌స్య ఉందన్న సంగతి తెలిసిందే. ట్రాన్స్‌ జెండర్లకు ట్రాఫిక్‌ బాధ్యతలు ఇస్తే…ట్రాఫిక్ త‌గ్గింపున‌కు ఉత్తమ ఉదాహరణగా మారేందుకు దోహ‌ద‌ప‌డుతుందని అంటున్నారు. ట్రాన్స్‌జెండ‌ర్ల గుర్తింపు, నియామ‌కం, శిక్షణ తర్వాత, ఈ ట్రాన్స్‌జెండ‌ర్ బృందాలు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు అండ‌గా నిలుస్తారని అంటున్నారు. మరి దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version