తెలుగులో ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి, రామ్మోహన్, బండి సంజయ్

-

18వ లోక్​సభ సమావేశాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. తొలుత ప్రొటెం స్పీకర్​గా భర్తృహరి మహతాబ్​ చేతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. అనంతరం పార్లమెంట్​కు చేరుకున్న ఆయన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. మొదట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణం చేయగా ఆ తర్వాత కేంద్ర మంత్రులు, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. మొదటగా ఏపీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు లోక్​సభ సభ్యుడిగా తెలుగులో ప్రమాణం చేశారు. అనంతరం కేంద్ర బొగ్గ గనుల శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కూడా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత లోక్​సభ సభ్యులుగా ఏపీకి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్, తెలంగాణకు చెందిన కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version