రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ నేతలు అరెస్ట్

-

నేడు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అదానీ షేర్ల స్కాం లో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఈ చలో రాజభవన్ కి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నేడు ఉదయం రాజ్ భవన్ వద్దకు ర్యాలీగా వచ్చారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. దీంతో రాజ్ భవన్ వద్ద కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

రాజ్ భవన్ ముట్టడి కోసం వచ్చిన వారిని అడ్డుకొని అరెస్టు చేశారు పోలీసులు. అదానీ విషయంలో బిజెపి వైఖరిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్రధాని మోదీ – అదాని బావా, బామ్మర్దులు అని.. వాళ్ల బంధం విడదీయరానిదని కాంగ్రెస్ నేత భట్టి అన్నారు. ఆదానిని ఎప్పుడు అరెస్టు చేస్తారని దేశం ఎదురు చూస్తుందన్నారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొలుపుతుందని ఆరోపించారు. ఎల్ఐసి, ఎస్బిఐ సంస్థలు డబ్బులను అదానికి దోచి పెట్టారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news