చచ్చేముందు నా చివరి కోరిక అదే – రాజాసింగ్

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి గ్రామంలో హిందువులను టార్గెట్ చేస్తున్నారని.. హిందువులని, ముస్లింలుగా కన్వర్ట్ చేస్తున్నారని అన్నారు.లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతులను పిల్లలను కనే మిషన్లుగా తీర్చిదిద్దుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులపై వ్యతిరేకంగా హిందువులతోనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధర్మం కోసం ఎదిరించి మాట్లాడితే గొంతులు, తలలు నరుకుతున్నారని అన్నారు. “ధర్మం గురించి మాట్లాడే నాలాంటి వారు కొంతమంది ఉండొచ్చు.. దీనిపై మాట్లాడుతున్నందుకు ఇవ్వాళ కాకుంటే రేపు నాపై బుల్లెట్లను ఉపయోగిస్తారు. వందకు వంద శాతం నన్ను చంపేస్తారు.. ఇది పక్కా.. డేట్ రాసి పెట్టుకోండి. ఈ విషయం నాకు కూడా తెలుసు. కానీ చచ్చేముందు నాదొక కల.. నాలాగా మీరు కూడా తయారుకావాలి. ఇది మా సంకల్పం. ఛత్రపతి శివాజీ హిస్టరీ నేను చదివా.. బతకాలంటే ఆయనలా బతకాలి.. చావాలంటే ఆయన కొడుకు శంభూజీలాగా చావాలి.

ఇది నా ఒక్కరి కల కాకూడదు. ప్రతి ఒక్క హిందువు కల కావాలి. ప్రతి ఒక్కరు ధర్మ రక్షణకు పాటుపడాలి. లేదంటే రేపు మీరు కూడా కన్వర్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయం వేరు.. ధర్మం వేరు. మీరు టీఆర్ఎస్ లో ఉంటారా? కాంగ్రెస్ లో ఉంటారా? బీజేపీలో ఉంటారా మీ ఇష్టం. ధర్మాన్ని రక్షించాలంటే బీజేపీలోనే ఉండాలనే రూల్ ఏం లేదు. ఎందుకంటే టీఆర్ఎస్ లో, కాంగ్రెస్ లో ఉంటే పూజలు చేయరా? మీరు ఏ పార్టీలో ఉన్నా ధర్మాన్ని రక్షించొచ్చు.

మీ ఆలోచనలో కొన్ని మార్పులు చేస్తే చాలు. జై శ్రీరామ్ అంటే బీజేపీ అనే ముద్ర ఎందుకు? రాముడు బీజేపీకి మాత్రమే చెందిన వాడా? టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీకి కాదా?ప్రతి రాజకీయ నాయకుడిని నేను కోరేది ఒక్కటే.. లవ్ జీహాదీని ఆపండి? మత మార్పిడిని అడ్డుకోండి.” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.