డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఓ యువ జంటకు కోర్టు షాక్ ఇచ్చింది. మొన్న మద్యం మత్తులో వీరంగం సృష్టించిన యువ జంటకు కోర్టు షాక్ ఇచ్చింది. యువ జంటకు బెయిల్ మంజూరు చేసి పనిష్మెంట్ వేసింది కోర్టు. ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కు హాజరై 2 గంటల పాటు 15 రోజులు రిసెప్షన్ లో విధులను నిర్వహించాలని ఆదేశించింది కోర్టు. మొన్న జూబ్లీ హిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేశారు.
అంతేకాదు… పోలీసుల మీద దురుసు ప్రవర్తన చేసింది ఆ యువ జంట. దీంతో ఆ యువజంట మీద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. దీంతో బెయిల్ మంజూరు కోసం వెరైటీ షరతు పెట్టింది కోర్టు. 15 రోజుల పాటు పోలీస్ స్టేషన్ కు వచ్చి 2 గంటల పాటు రిసెప్షన్ లో కూర్చోవాలి అని కోర్టు షరతులు పెట్టింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వచ్చారు నిందితులు.