మొన్న గాంధీ విగ్రహం నోట్లో టపాసు.. ఇవాళ ఏం చేశారంటే..?

-

దీపావళి పండుగ సందర్భంగా సాధారణంగా అందరూ టపాసులు కాల్చుతుంటారు. కానీ హైదరాబాద్ నగరంలోని బోయినపల్లిలో కొందరూ యువకులు వెరైటీగా టపాసులు పేల్చి అందరి నోటా తిట్టించుకున్నారు. జాతిపిత మహాత్మగాంధీ విగ్రహాన్ని అవమానించారు. విగ్రహం నోట్లో టపాసులు పెట్టి కాలుస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ వీడియోలను సుమోటోగా తీసుకొని గాంధీ విగ్రహాన్ని అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీకి పలువురు నెటిజన్లు ఫిర్యాదు చేశారు.

ముఖ్యంగా మహాత్మగాంధీ విగ్రహం నోట్లో టపాసులు పెట్టి కాల్చిన వీడియో వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా వారంతా అదే గాంధీ విగ్రహానికి పూలమాల వేసి దండం పెడుతూ తమను క్షమించాలని కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. పోలీసులు చర్యలు తీసుకోకముందే స్వచ్ఛందంగా ఈ యువకులు ముందుకు వచ్చారు. మహాత్మా.. మన్నించు.. ఇంకోసారి అలా చేయమని దండం పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో చూసిన వారు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version