ఆదివాసీలకు దగ్గరయ్యేందుకు అధికార పార్టీ కొత్త ప్లాన్

Join Our Community
follow manalokam on social media

ఆదివాసీలకు దగ్గరయ్యేందుకు అధికార పార్టీ కొత్త ప్యూహాలు రచిస్తుంది. పోడు భూముల సమస్యతోపాటు ఇప్పుడొచ్చిన పులుల సమస్యను అవకాశంగా భావిస్తున్న అధికార టీఆర్ఎస్ అటవీశాఖను అడ్డంగా బుక్ చేసే ప్రయత్నాల్లో ఉందా ఇదే అంశం ఇప్పు అటవీశాఖ అధికారుల్లో టెన్షన్ పుట్టిస్తుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు కూడా దీనికి బలం చేకురుస్తున్నాయి.

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పులుల దాడులు రాజకీయ దుమారం రేపాయి. కొమురంభీం జిల్లాలో పులులు దాడి చేసి ఇద్దరు ఆదివాసీ బిడ్డల ప్రాణాలు తీయడంతో ఆదివాసీల్లో అటవీశాఖ అధికారులు,ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేఖత వ్యక్తమవుతుంది. ప్రభుత్వం ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిస్తారని ఎదురుచూస్తుండగా సీఎం కేసీఆర్ సైతం త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హమీఇచ్చారు..ఇది జరిగి రెండేళ్లు గడుస్తున్నా పోడు భూములకు పట్టాలు రాకపోవడం,పైగా పులులు ఇప్పుడు ఏకంగా ఇద్దరిని చంపేయడం ఆదివాసీల ఆగ్రహానికి కారణమైంది. ఆదివాసీ ఎమ్మెల్యేలు సైతం పోడు భూముల సమస్య పరిష్కారం కాకపోవడం పై కాస్త ఘాటు వ్యాఖ్యలే చేశారు.

ఓ ఎమ్మెల్యే దాడులు చేయమనడం,ఇంకో ఎమ్మెల్యే సర్కార్ ను బదనాం చేస్తున్నారని ఇటీవల అటవీశాఖ అదికారుల తీరుపై ఫైరయ్యవ్వడం..పోడు భూములకు పట్టాలివ్వాల్సి వస్తుందేమోనని పులులను ప్రభుత్వం తీసుకొచ్చి అడవుల్లో వదలిపెట్టిందన్న ప్రతిపక్ష నేతల ఆరోపణలు..ఇలా అన్ని ఆరోపణలకు చెక్ పెట్టేందుకు అధికారులను టార్గెట్ చేస్తూ అధికార టీఆర్ఎస్ ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో అధికారులను ప్రతిపక్షాలే కాదు అధికార పార్టీ నేతలు సైతం ఇష్టంవచ్చినట్లు మాట్లాడేస్తున్నారంటా.

ఏజెన్సీప్రాంతాలు లేదా ఆదివాసీల ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నట్టుండి స్వరం పెంచడం వెనక ఆంతర్యం ఇదేనా అన్న చర్చ నడుస్తుంది. ఈమద్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిచ్చే అవకాశం ఉందనే ప్రచారం ఉండగా ఆక్రెడిట్ తమ ఖాతాలో పడాలంటే అటవీశాఖ అదికారుల తప్పిదాలే అని బ్లేమ్ చేయాలనే ఉద్దేశ్యంతో అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అటవీశాఖ అధికారుల్లో కొత్త గుబులు పట్టుకుందట.

వాస్తవంగా అటవీశాఖ లేదా జిల్లా స్థాయి అధికారులు సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉండదు. ఉన్నతాదికారుల ఆదేశాలు లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోరు. ఈ విషయాలన్ని తెలిసినా ప్రజాప్రతినిధులు సైతం కావాలనే బదనాం చేస్తున్నారనే చర్చ అటవీశాఖ అధికారుల్లో నడుస్తుంది. రోజుకోచోట అధికారులను టార్గెట్ చేస్తూ ఎక్కడో ఒక్కచోట నేతలు మాటలు వదులుతూనే ఉన్నారు. అయితే వారి పై ఆరోపణలు మాని పట్టాలివ్వాలనే డిమాండ్ ఆదివాసీలనుంచి వస్తుందట.

TOP STORIES

అందరి ముందు మాట్లాడాలంటే భయమా…? అయితే ఇది మీకోసం…!

చాలా మంది కింద చాలా బాగా మాట్లాడతారు. కానీ ఒక్కసారి అందరి ముందు నిలబడి మాట్లాడాలంటే చేతులు వణికి పోతాయి. అలానే పేనిక్ అయిపోతుంటారు. ఇది...