కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏపీ విభజన చట్టం అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఏపీ ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. ఎన్నికల నేపథ్యంలో హోంశాఖ సమావేశానికి తెలంగాణ అధికారులు దూరంగా ఉన్నారు.
ఏపి డిమాండ్స్ ఇవే..!
1.పోలవరం, ప్రత్యేక హోదా , విద్యాసంస్థల ఏర్పాటు మౌలిక వసతుల ప్రాజెక్టులు, 13వ షెడ్యూల్లోని ఆస్తుల విభజన తదితర అంశాలపై చర్చ
2.ఏపీ విభజన చట్టం అమలుపై కేంద్ర హోంశాఖ తో చర్చించాల్సిన అంశాలపై నిన్ననే దిశా నిర్దేశం చేసిన సీఎం వైఎస్ జగన్
3.రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ కి తీవ్ర నష్టం జరిగింది. ఏపీకి అప్పుల్లో 58 శాతం, రెవెన్యూలో 42 శాతం వచ్చింది
4. ప్రత్యేక హోదా హామీ నెరవేర్చలేదు, పోలవరం నిధుల రాకలో సమస్యలున్నాయి.
5. తెలంగాణ నుండి రావాల్సిన విద్యుత్ బకాయిలు కూడా రాలేదు
6. హైదరాబాద్ ను కోల్పోవడం వలన రెవెన్యూ రూపంలో చాలా నష్టపోయాం
7. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ పట్ల కేంద్రం తప్పనిసరిగా ప్రత్యేకత చూపించాల్సి ఉంది
8. అధికార వికేంద్రీకరణ, సమగ్రాభివ్రు్ద్ధిలో భాగంగా మూడు రాజదానులు ప్రకటించాం
9.మూడు ప్రాంతాలను అనుసంధానిస్తూ రవాణా వ్యవస్థ అభివ్రుద్ధి చెందాల్సిన అవసరం ఉంది
10. ఇందుకు కేంద్రం నుండి సహకారం, సహయం అవసరం. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన ఇంకా పెండింగ్ లో ఉంది
దీనికోసం ఒత్తిడి తీసుకురావాలి
11 వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై కూడా దృష్టి పెట్టాలన్నారు సీఎం వైఎస్ జగన్.