తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. ఇవాళ జమాతుల్ వాద నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ప్రకటించగా, హైదరాబాద్లోని అనేక ప్రాంతాలు, జిల్లాల్లో కొన్ని చోట్ల స్కూళ్ళకు సెలవు ఇచ్చారు. ఇక మన దేశంలో రేపు రంజాన్ జరుపుకుంటారు.
దీంతో రేపు కూడా సెలవు ఉండనుండగా, ఎల్లుండి ఆదివారంతో కలిపి మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఇది ఇలా ఉండగా.. AP EAPCET లో ఇంటర్ మార్కులకు ఈ ఏడాది వెయిటేజీ ఇవ్వనున్నారు. కరోనా వల్ల గతంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించకపోవడంతో వెయిటేజీ తొలగించగా, ఈ ఏడాది 25% ఇంటర్ మార్కుల వెయిటేజీని పునరుద్ధరించారు. EAPCET లో వచ్చే 75%, ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చి ర్యాంకులకి కేటాయిస్తారు. ఇంటర్ లో ఎస్సీ, ఎస్టీలకు 40%, ఇతరులకు 45% మార్కులు తప్పనిసరి. కాగా, తెలంగాణలో వెయిటేజిని పూర్తిగా తొల గించి ఎంసెట్ ర్యాంకులు కేటాయిస్తున్నారు.