నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

-

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్‌ విందు జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఇతర ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.

ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా..

  • ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ వైపు నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వచ్చే వారిని నాంపల్లి, చాపల్‌ రోడ్డు వైపు మళ్లిస్తారు.
  • అబిడ్స్‌, గన్‌ఫౌండ్రీ వైపు నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ నుంచి చాపల్‌రోడ్డు,స్టేషన్‌ రోడ్డు వైపు మళ్లిస్తారు.
  • బషీర్‌బాగ్‌ నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు రూట్‌లో వచ్చే వాహనాలను కింగ్‌ కోఠి, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ రోడ్డులోకి పంపిస్తారు.
  • సుజాత స్కూల్‌ లైన్‌ నుంచి ఖాన్‌ లతీఫ్‌ఖాన్‌ బిల్డింగ్‌ వైపు వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను సుజాత స్కూల్‌ జంక్షన్‌ నుంచి నాంపల్లి స్టేషన్‌ రోడ్డు మీదుగా ఆయా ప్రాంతాలకు మళ్లిస్తారు.

మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు పోలీస్‌ కంట్రోల్‌ రూం, బషీర్‌బాగ్‌, బీజేఆర్‌ విగ్రహం సర్కిల్‌, ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ, అబిడ్స్‌ సర్కిల్‌, ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌, నాంపల్లి, కేఎల్‌కే బిల్డింగ్‌, లిబర్టీ, రవీంద్ర భారతి, లక్డీకపూల్‌, ఇక్బాల్‌ మినార్‌, హిమాయత్‌నగర్‌, అసెంబ్లీ, ఎం.జే.మార్కెట్‌, హైదర్‌గూడ జంక్షన్లలో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ జంక్షన్ల నుంచి రాకపోకలు సాగించకపోవడం మంచిదని అదనపు సీపీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news