న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. రాత్రి 10 గంటల నుంచి ఫ్లై ఓవర్లు బంద్

-

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాదులో డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10:00 నుంచి జనవరి ఒకటవ తేదీ ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. అటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 రాత్రి 10:00 నుండి తెల్లవారు 5 గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్డు పై పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పైన వాహనాలను అనుమతించరు. అయితే ఎయిర్పోర్టుకి వెళ్లే వాహనాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది.

- Advertisement -

అలాగే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, జేఎన్టీయూ ఫ్లైఓవర్, గచ్చిబౌలి శిల్ప లేఅవుట్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లై ఓవర్, బయోడైవర్సిటీ పార్క్ ఫ్లైఓవర్ లెవెల్ 1, లెవెల్ 2, రోడ్ నెంబర్ 45 ఫ్లైఓవర్, షేక్ పేట ఫ్లైఓవర్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్ ఫ్లై ఓవర్, బాలానగర్ బాబు జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్, కైతలాపూర్ ఫ్లైఓవర్ లో వాహనాలను అనుమతించరు. అయితే టాక్సీలు, క్యాబ్ లు, ఆటో డ్రైవర్లు ప్రజలను ప్రయాణానికి నిరాకరించకూడదని సైబరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...